టీడీపీకి వైసీపీ అదిరిపోయే కౌంటర్

టీడీపీకి వైసీపీ అదిరిపోయే కౌంటర్

0

రుణమాఫీ హామీ ప్రకటించి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ( పచ్చపార్టీ ) గెలిచిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. అయితే ఇంకా 7,582 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా అకౌంట్లలో జమ చేసినట్టు ఎన్నికల ముందు కుల మీడియాతో రాయించారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడా మాఫీ సొమ్మును ఇవ్వకుండా రైతులను వేధిస్తారా అని యనమల సొల్లు వాదన చేస్తున్నారని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అలాగే కిలోమీటర్ల లెక్కన లీజుకు తీసుకునే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణతో ఆర్టీసీకి ఏం సంబంధం ఉందని చంద్రబాబును ప్రశ్నించారు. దానికి ఒప్పుకోనందుకే మీరు నియమించిన సురేంద్రబాబును బదిలీ చేశారని దిక్కుమాలిన ఆర్గ్యుమెంటు చేస్తున్నారని మండిపడ్డారు. హైర్ బస్సుల నిర్వహణ ఎక్కడైనా వాటి యాజమాన్యాలే చేస్తాయి కదా అని విజయసాయి రెడ్డిప్రశ్నించారు