వైసీపీ ఎత్తుల‌కు టీడీపీ స‌రికొత్త ఎత్తులు

వైసీపీ ఎత్తుల‌కు టీడీపీ స‌రికొత్త ఎత్తులు

0

స్ధానిక సంస్ధ‌ల ఎన్నిక‌లు తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి ఇస్తాయి అని చూస్తున్నారు.. ఆరు నెల‌ల వైసీపీ పాల‌న‌ను మ‌నం ఎండ‌గ‌ట్టామ‌ని, క‌చ్చితంగా ప్ర‌జ‌ల్లో మార్పు వ‌స్తుంది అని, రాజ‌ధాని నిర్మాణంలో వైసీపీ ఫెయిల్ అవుతోంది అని, చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినా , కొంద‌రి ఉద్యోగాలు పీకేశార‌ని ,ఇలా అనేక అంశాలు జ‌నాల‌లోకి వెళ్లాయ‌ని భావిస్తున్నారు టీడీపీ నేత‌లు.

అందుకే ఈ స్ధానిక సంస్ధ‌ల ఎన్నిక‌లు మ‌న‌కు ప్ల‌స్ అవుతాయి అని భావిస్తున్నారు తెలుగుదేశం నేత‌లు.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొంద‌రు సీనియ‌ర్లు ఇదే చెబుతున్నారు. మ‌న‌కు పార్టీ త‌ర‌పున ఉన‌్న కేడ‌ర్ ని పోగొట్టుకోకూడ‌ద‌ని భావిస్తున్నారు.

ఎవ‌రైనా నాయ‌కుడు పార్టీ నుంచి వెళ్లిపోయినా, మ‌న కేడ‌ర్ మాత్రం చెదిరిపోకుండా చూసుకోవాలి అని చెబుతున్నారు నేత‌లు.. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొంద‌రు నేత‌లపై టార్గెట్ పెట్టార‌ని, వారికి మ‌నం అండ‌గా ఉండాలి అని తాజాగా టీడీపీ నేత‌లు చ‌ర్చించుకున్నార‌ట‌.