వైసీపీకి పవన్ అగ్ని పరీక్ష

వైసీపీకి పవన్ అగ్ని పరీక్ష

0

జనసేన అధినేత పవన్ కల్యాణ కాకినాడలో రైతులకు మద్దతుగా దీక్ష ప్రారంభించారు.రైతు సౌభాగ్య దీక్ష కు పెద్ద ఎత్తున జనసైనికులు కూడా పాల్గొన్నారు, మొత్తానికి లాంగ్ మార్చ్ తర్వాత పవన్ చేపడుతున్న దీక్ష కావడంతో పెద్ద ఎత్తున జనసైనికులు కూడా ఇందులో పాల్గొంటున్నారు.

మొత్తానికి వైసీపీ ప్రభుత్వం దీనిపై ఏమంటుందో చూడాలి. అంతేకాదు మరోపక్క శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో దీక్ష అంటే ఇది కచ్చితంగా అధికార పార్టిక ఎదురు అయ్యే పెద్ద సమస్య అనే అనుకోవాలి.

నగరంలోని జేఎన్టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో పవన్ దీక్షకు కూర్చున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనేది పవన్ ప్రధాన డిమాండ్. పవన్ నాదెండ్ల మనోహర్, నాగబాబులు కూడా పవన్ పక్కనే ఉన్నారు.