వైసీపీకి షాక్ లోకేశ్ మరో పోరాటం

వైసీపీకి షాక్ లోకేశ్ మరో పోరాటం

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారిందని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. దీంతో ప్రజలపై సంవత్సరానికి వెయ్యి కోట్ల భారం పెరిగిందని ఆరోపించారు..

పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ లోకేశ్ మంగళగిరి నుండి అసెంబ్లీకి బస్సులో టీడీపీ ఎమ్మెల్సీలతో ప్రయాణించారు…

15 కిలోమీటర్లుకు పెంచిన ధర ప్రకారం రూపాయిన్నర పెరగాలని అన్నారు. కానీ ఐదు రూపాయిలు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకూ పోరాటం కొనసాగిస్తామని లోకేశ్ అన్నారు…