అంతుచూస్తానంటూ వైసీపీ లేడీ లీడర్ వార్నింగ్

అంతుచూస్తానంటూ వైసీపీ లేడీ లీడర్ వార్నింగ్

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి…. ఒకరిపై మరోకరు పరోక్షంగా అలాగే ప్రత్యక్షంగా విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే రాజధాని గుంటూరు చిలకలూరిపేట నియోజకవర్గంలో చోటు చేసుకుంది…

వైసీపీ నేతల, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే విడుదల రజని వర్గ విభేదాలను భహిర్గతం చేశారు.. ఎక్కడైన అధికార పార్టీనాయకులు ప్రతిపక్ష నాయకులపై ఎంతవరకైనా పోరాడవచ్చని కానీ సొంత పార్టీ వ్యక్తులతో కూడా యుద్దం చేయాల్సి వచ్చిందని న్నారు…

ఇక నుంచి తనను వెన్నుపోటు పొడవాలని చూస్తున్న వారి అంతు చూస్తానని రజని హెచ్చరించారు…. అదే తన నైజం అని అన్నారు… ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగు నెలల నుంచి ఏ రోజు తాజు ఆనందంగా మనసారా ఆస్వాదించలేదని అన్నారు… ఆడపిల్లనైన తాను నాలు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోందని రజని అన్నారు