వైసీపీలోకి ఆదినారాయణ రెడ్డి బ్రదర్

వైసీపీలోకి ఆదినారాయణ రెడ్డి బ్రదర్

0

ఏపీలో వైసీపీకి మరింత వేవ్స్ పెరుగుతున్నాయి.. ఇక రాజధానిగా మూడు ప్రాంతాలు అనేసరికి మూడు ప్రాంతాల్లో చాలా మంది సీనియర్లు పక్క పార్టీలో ఉన్న నేతలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. అంతేకాదు వైసీపీలో చేరాలి అని భావించే వారు కూడా ఇప్పుడు పెరిగిపోయారు అనే చెప్పాలి.. ముఖ్యంగా తెలుగుదేశం జనసేనలో ఉన్న నేతలు కూడా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.. అంతేకాదు ఉత్తరాంధ్రా సీమలో చాలా మంది జగన్ కు ఫ్యాన్స్ అయ్యారు.

తాజాగా ఏపీకి మూడు రాజధానుల అంశం తర్వాత సీమలో జగన్ కు నీరాజనాలు పలుకుతున్నారు నాయకులు.. ముఖ్యంగా అక్కడ హైకోర్ట్ ఏర్పాటు చేస్తే సీమకు న్యాయం చేసిన వారు అవుతారు అని అంటున్నారు, ఈ సమయంలో తాజాగా బీజేపీ నేత ఆదినారయణరెడ్డి సోదరుడు జగన్ పై పాజిటీవ్ కామెంట్స్ చేశారు. సీమలో ఇదే చర్చ జరుగుతోంది.

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు శభాష్ అని ప్రశంసించారు….. ఈనెల 23న జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడానికి వస్తున్న జగన్ కు స్వాగతం పలికారు. దీంతో ఆయన పార్టీలో చేరుతారు అనే చర్చ జరుగుతోంది అయితే ఆయన సోదరుడితో సంబంధం లేకుండా రాజకీయంగా ముందుకు వెళ్లాలి అని భావిస్తున్నారట.. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.