వైసీపీలోకి వంగవీటి రాధా ?

వైసీపీలోకి వంగవీటి రాధా ?

0

వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయలేకపోతున్నారు.. ముఖ్యంగా ఇప్పుడు ఆయన టీడీపీలో ఉంటే పార్టీ తరపున ఆయనకు ఎలాంటి ఉపయోగం లేదు అని తేలిపోయింది.. మరో 15 ఏళ్లు అయినా టీడీపీ బలోపేతం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. మరో పక్క జనసేనలో ఆయన చేరుదాము అంటే పవన్ కల్యాణ్ విధానాలు అర్ధం కావడం లేదు. అయితే ఈ సమయంలో వైసీపీలో పాత మిత్రులు కూడా రాధాని మళ్లీ పార్టీలో చేరాలి అని అడుగుతున్నారట.

పార్టీలోకి రావాలి అని కోరతున్నారని తెలుస్తోంది. అయితే రాధా మాత్రం ఆనాడు జగన్ పై చేసిన విమర్శల వల్ల పార్టీలో విలువ లేకుండా పోతుంది అని మదన పడుతున్నారట.. కాని జగన్ తో మంత్రి కొడాలి నాని సంప్రదించి ఆయనని పార్టీలోకి తీసుకువచ్చేలా చూస్తున్నారు అని తెలుస్తోంది.

మరి నాని మధ్యవర్తిత్వం వహించి పార్టీలోకి తీసుకువస్తే ఇక విజయవాడ పాలిటిక్స్ లో దేవినేని వర్సెస్ వంగవీటి కుటుంబాల మధ్య విభేదాలు తగ్గుతాయి అని అంటున్నారు ..మొత్తానికి ఈ నిర్ణయం జగన్ తీసుకుంటే రాజకీయంగా వైసీపీ వేవ్స్ మరింత పెరుగుతాయి, కాని రాధాకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది చూడాలి పార్టీలోకి.