వైసీపీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో అశ్లీల డాన్సులు

వైసీపీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో అశ్లీల డాన్సులు

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా అశ్లీల నృత్యాలు చేయించారు… తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి.. తన జన్మదిన వేడుకలు పుల దండలు, కేక్ కటింగ్ వంటి హంగామ చర్యలు లేకుండా జన్మదిన వేడుకలు జరపాలని కార్యకర్తలకు చెప్పారు సూర్యనారాయణ రెడ్డి.

అయితే కార్యకర్తలు ఆయన మాటను లెక్క చేయలేదు.. పెదపూడిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు.. వేదికపై సుమారు ఐదుగురు అమ్మాయిలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు..

పోలీసులకు ఈ విషయం తెలిసినా కూడా అశ్లీల నృత్యాలను అడ్డుకోలేదు.. ఈ విషయం సదరు ఎమ్మెల్యేకు తెలియడంతో కార్యకర్తలకు నాయకులు వార్నింగ్ ఇచ్చారు