వైసీపీలో ఎంపీ, మంత్రిల మధ్య బిగ్ ఫైట్

వైసీపీలో ఎంపీ, మంత్రిల మధ్య బిగ్ ఫైట్

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 అయిందో లేదో అప్పుడే ఆ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.. దీంతో కార్యకర్తల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయి.. గతంలో ఎన్నడు లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో ప్రస్తుతం జూనియర్స్ సీనియర్స్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది..

ఈ వ్యవహారానికి సంబంధించి జగన్ త్వరలో నిర్ణయం తీసుకోకపోతే వర్గ విభేదాలు ఎటువైపు దారి తీస్తాయోనని విశ్లేషకులు అంటున్నారు… అమలాపురం నియోజకవర్గానికి చెందిన మంత్రి విశ్వరూప్ కు అదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ అనురాధల ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం నెలకొంది.

వీరిద్దరు అమలాపురంలో ఆదిపత్యంకోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మరో మంత్రి పిల్లి సుభాష్ అనురాధకు మద్దతుగా నిలవడంతో ఆమె అమలాపురంలో పెత్తనం చలాయించాలనే క్రమంలో ఉన్నారట. ఇక మరోవైపు విశ్వరూప్ పట్టు సాధించడంకోసం తన సీనియార్టీకి పదును పెడుతున్నారట