వైసీపీకి షాక్ ఇచ్చిన ఎంపీ

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎంపీ

0

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ షాక్ ఇచ్చారు… రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యాబోధన అందించాలని సర్కార్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే…

అయితే దీనిపై ప్రతిపక్షాలనుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే… తాజాగా లోక్ సభలో వైసీపీ ఎంపీ రఘురామరాజు వైసీపీకి షాక్ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

మాతృభాష పరిరక్షణకు ఉద్దేశించి రాజ్యాంగంలోని 350 350ఏ అధికరణాల స్పూర్తి దెబ్బతిన కుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు… 350ఏ అనేది ఎవరైనా ప్రాంతీయ భాషలో తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు…