వైసీపీ నేత పృథ్వీపై పోసాని సంచలన కామెంట్లు

వైసీపీ నేత పృథ్వీపై పోసాని సంచలన కామెంట్లు

0

రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యానించిన వైసీపీ నేత పృథ్వీపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు… మహిళలు కూడా వీడియోల రూపంలో విమర్శలు చేస్తున్నారు.. అయితే ఇప్పుడు తాజాగా ఆయన చేసిన కామెంట్లపై వైసీపీకే చెందిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పృథ్వీ చేసిన కామెంట్ల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుంది అని విమర్శించారు.

ఎంతో గౌరవంగా బతికే కమ్మవాళ్లను రోడ్డుపైకి ఈడ్చాడంటూ మండిపడ్డారు. భూములు ప్రభుత్వానికి ఇచ్చిన రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నావు ఇది మంచిది కాదు అని విమర్శించారు..రైతులంటే మోకాళ్ల దాకా పొలంలో దిగి పనులు చేసుకుంటూ, చెట్టు కింద అన్నం తిని వెళ్లిపోయేవాళ్లా. రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోరా? ఆడవాళ్లు ఖరీదైన బట్టలు వేసుకోరా, బంగారు గాజులు వేసుకోరా అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా మీడియా ముఖంగా వారికి క్షమాపణ చెప్పాలి ఆ మాటలు విత్ డ్రా చేసుకోవాలని పోసాని పృథ్వి కి తెలియచేశారు.

సెల్ ఫోన్లు బంగారం అందరికి ఉంటాయి ఇలా కామెంట్ చేయడం తప్పు అన్నారు, మీరు మాట్లాడే మాటల వల్ల ప్రతిపక్షం ఛాన్స్ తీసుకుంటుంది ఇది ముఖ్యమంత్రికి చెడ్డపేరు తెస్తుంది అని విమర్శించారు ఆయన.మరి పృథ్వీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుని సమాధానం చెబుతారో చూడాలి.