సుజనాకు చెక్ పెట్టేందుకు వైసీపీ భారీ ప్లాన్

సుజనాకు చెక్ పెట్టేందుకు వైసీపీ భారీ ప్లాన్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు బీజేపీ నేత సుజనా చౌదరికి వైసీపీ సర్కార్ చెక్ పెట్టేందుకు భారీ ప్లాన్ వేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు..

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని భూముల కేటాయింపు విషయంలో భారీ అక్రమాలు, అవినీతి జరిగిందని తొలినుంచి వైసీపీ విమర్శలు చేస్తునే ఉంది. అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని వెలికి తీసేందుకు విచారణ చేపట్టింది.

ముఖ్యంగా సుజనాకు, ఆయన బంధువులుకు, బినామీల పేర్లతో ఏమైనా భూములు ఉన్నాయి అన్న కోణంలో రహస్య విచారణ చేస్తోందట… రెవిన్యూ, సీఐడీ, విజెలెన్స్ అధికారులు గత వారం నుంచి మోగలూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు వంటి గ్రామాల్లో రహస్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం…