చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్..స్పందించిన మెగాస్టార్

YCP Rajya Sabha seat offer to Chiranjeevi..megastar who responded

0

సీఎం జగన్​తో నిన్న చిరంజీవి భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీ ప్రధానంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై అయినట్లు తెలుస్తుంది. అయితే ఈ భేటీపై ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. చిరంజీవికి వైకాపా రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ స్పందించారు.

నాకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమే. రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలను ఖండిస్తున్నా. అలాంటి ఆఫర్లు నా వద్దకు రావు. రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు ఆఫర్లు ఎవరూ ఇవ్వరు. అలాంటి ఆఫర్లకు లోబడే వ్యక్తిని కాను. పదవులను కోరుకోవడం నా అభిమతం కాదు. -చిరంజీవి

సినిమా టికెట్ల ధరలపై రెండు, మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమలో తలెత్తిన సమస్యలను రెండువైపులా తెలుసుకోవాలని ఏపీ సీఎం జగన్​ ఆకాంక్షించారని… సినిమా టికెట్లపై పునరాలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు.. ఉభయులకూ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారని చిరంజీవి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here