మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్..

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ ఇచ్చిన వైసీపీ సర్కార్..

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది… తాజాగా ఆమె భర్త భార్గవ్ రామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

క్రషర్ ఇండస్ట్రీని పూర్తిగా తమకే అప్పగించాలంటూ అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ శివరామిరెడ్డిని బెధించారని తెలిపారు. అతని ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు…. కాగా ఈ ఎన్నికల్లో అఖిల ప్రియ టీడీపీ తరపున ఆళ్ళగడ్డలో పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే.

అలాగే అమె సోదరుడు భూమా బ్రహ్మనందరెడ్డికూడా నంద్యాలలో పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే…గతంలో వైసీపీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన అఖిల ప్రియ 2014 టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి టీడీపీలో జంప్ అయ్యారు