వైసీపీ టీడీపీల మధ్య వార్

వైసీపీ టీడీపీల మధ్య వార్

0

అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య రాష్ట్రంలో ఏదో ఒక చోట వాగ్వాదం చోటు చేసుకుంటుంది… తాజాగా అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది… ఒకే వర్గానికి చెందిన వ్యక్తులు. రెండు వర్గాలుగా విడిపోయి… నిందారాపోణలు చేసుకున్నారు…

పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు ఎమ్మార్మో ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు… దీంతో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు… టీడీపీ నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు..

కాగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు నాటినుంచి 2014 ఎన్నికల వరకు అనంతపురం జిల్లా ఆ పార్టీకి కంచుకోటగా వ్యవహరిస్తూ వచ్చింది… రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈ జిల్లాలో మాత్రం టీడీపీ జెండా ఎగిరేంది… ఈ జిల్లాలో అంతలా పాతుకుపోయిన టీడీపీని 2019 ఎన్నికల్లో జగన్ సునామి తో చెల్లా చెదరం అయింది 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో 12 వైసీపీ కైవసం చేసుకుంది…