వైసీపీ విషయంలో పవన్ మరో సంచలన నిర్ణయం

వైసీపీ విషయంలో పవన్ మరో సంచలన నిర్ణయం

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు… కొద్దికాలంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు…. పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు…

ఇటీవలే రాయలసీమలో తన టూర్ ను ముగించుకున్న పవన్ తాజాగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు… ఈ పర్యటనలో ఆయన రైతు కష్టాలను నేరుతా తెలుసుకున్నారు… ఈ సందర్భంగా పవన్ అధికార పార్టీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు…

రైతులు కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవటంలేదని విమర్శించారు… ఈ క్రమంలో ఓ రైతు పవన్ కు కొబ్బరి బోండాన్ని అందించారు… ఆ కొబ్బిరి బోండాన్ని తీసుకున్న పవన్ దాన్ని తిరిగి ఇచ్చేశారు… రైతులు కష్టాలు తీరే వరకు తాను కొబ్బరి బోండం నీళ్లు తగనని అన్నారు…