ఎల్లో మీడియాకు ఏపీ మంత్రి నోటీసులు

ఎల్లో మీడియాకు ఏపీ మంత్రి నోటీసులు

0

తెలుగుదేశం ఆస్ధాన పత్రిక మొత్తం జగన్ పై విష ప్రచారాలు వ్యతిరేక కథనాలతో నిత్యం మసాలాతో గుబాలిస్తోంది.. అయితే జగన్ కొత్తగా జీవో తీసుకువచ్చారు. తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాస్తే వారిపై సదరు డిపార్ట్ మెంట్ హెడ్డు కేసు వేయవచ్చు అని ,తాజాగా ఇప్పుడు తప్పుడు కథగా వండి వార్చిన దానిపై కేసు వేసేందుకు మంత్రి తరపున అధికారులు సిద్దం అవుతున్నారట.

అయితే ఏపీలో ఓ మంత్రి రాజీనామా చేయడానికి సిద్దం అవుతున్నారు అని వార్తలు వండింది ఎల్లో మీడియా, అది కూడా ఆయన నిధులు బడ్జెట్ అలాట్ చేయలేక సతమతమవుతున్నారని. ఏపీలో నిధులు సరిపోక బడ్జెట్ మిగులు లేకుండా ఉంటే జగన్ హామీలకు నిధులు చాలలేక ఈ బాధకు ఆయన రాజీనామా చేస్తారు అని వార్తలు వదిలారు. దీనిపై సదరు మంత్రి కేసు ఫైల్ చేసేందుు ఎల్లో మీడియాకు నోటీసులు పంపనున్నారట. ఇప్పటికే చాలా కేసులు అలాగే పలు కంప్లైంట్స్ ఇచ్చినా వారిలో మార్పు రావడం లేదని కోర్టుకు వెళ్లనున్నారట సదరు మంత్రి.