ఎవరూ చేయని పాత్ర చేస్తున్న రష్మి

ఎవరూ చేయని పాత్ర చేస్తున్న రష్మి

0

హాట్ యాంకర్‌ రష్మి బుల్లితెర సంచలనం అనే చెప్పాలి జబర్దస్త్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఇప్పుడు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తన నటనతో కుర్రకారు మతిని పోగొడుతోంది ఈ అమ్మడు, అయితే ఆమెరోల్స్ కంటె టెలివిజన్ షోలకు ఫ్యాన్స్ బాగా ఉన్నారు. ఇక వరుసగా వచ్చిన సినిమాలు చేసినా పెద్దగా అవకాశాలులేకున్నా బుల్లితెరని మాత్రం ఏలుతున్న లీడ్ యాంకర్ అనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం పోస్టులతో యాక్టీవ్ గా ఉంటుంది, హట్ హట్ అందాలతో మత్తెక్కిస్తుంది.

ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ పెద్ద వెబ్ సిరీస్ లో చేసేందుకు ఒకే చెప్పింది రష్మీ అని తెలుస్తోంది.అయితే అందులో రష్మీ ఏ పాత్ర చేయబోతోందో తెలుసా..? లెస్బియన్. ఈ పాత్ర గురించి విన్న రష్మీ.. వెంటనే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తెలుగులో వస్తుందా వేరే భాషలో వస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది, దీనిపై ఎలాంటి వార్త రావడం లేదు, అయితే ఆమె ఎంచుకున్న పాత్ర అంత ఈజీకాదు అని తెలుస్తోంది. దీనికోసం ఆమె కాస్త శ్రమించాలి అని కూడా చెబుతున్నారట.