హైదరాబాద్ లో ఘోరం..యువకుడు సజీవదహనం

0

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఫలక్‌నుమా పరిధిలో ఓ యువకుడు బాలికతో పెళ్లి జరిపించాలని బెదిరిస్తూ ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్రగాయాలతో ఉన్న యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ దారుణ ఘటన నిన్న చోటు చేసుకోగా బాధితుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here