ఆ నిర్ణయంతో జగన్.. వై.ఎస్‌.ఆర్‌. కొడుకు అనిపించుకున్నాడుగా..?

ఆ నిర్ణయంతో జగన్.. వై.ఎస్‌.ఆర్‌. కొడుకు అనిపించుకున్నాడుగా..?

0

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసింది అక్షరాలా ఆరు సంవత్సరాలే.. ఆయనకంటే ఎక్కువ కాలం చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ వారిలో చాలామంది కన్నా వైఎస్ ఆర్ ఎక్కువగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.

ప్రజల ముఖ్యమంత్రిగా ఖ్యాతి సంపాదించారు. అందుకు ప్రధాన కారణం ఆయన కాలంలో అమలైన సంక్షమ పథకాలు మాత్రమే. ఇప్పుడు జగన్ కూడా వైఎస్ ఆర్ బాటలోనే పయనిస్తున్నారు. ప్రత్యేకించి వైఎస్ ఆర్ కు ఎక్కువ పేరు తెచ్చిన పథకం ఆరోగ్య శ్రీ.

ఈ ఒక్క పథకంతో ఆయన చాలా కుటుంబాల్లో దేవుడే అయ్యారు. అందుకే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా తండ్రి ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీర్చి దిద్దుతున్నారు. తాజాగా బడ్జెట్ లో కేటాయింపులు ఆమేరకు ప్రాథాన్యం సంతరించుకున్నాయి.

వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు తక్కువ ఉన్న అన్ని కుటుంబాలకు…రూ. 40 వేలు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తించేలా నిబంధనలు సవరించారు. వెయ్యి రూపాయలకు మించిన అన్ని కేసులు చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా..అన్ని చికిత్సలకు అందించాలని నిర్ణయించారు.

సరిహద్దు జిల్లాల్లో ఉన్న ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో ఉన్న మంచి ఆస్పత్రులను ప్రభుత్వ జాబితాలోకి చేరుస్తున్నారు. ఈ ఏడాది రూ. 1540 కోట్లు కేటాయించారు.