అదే ప్లేస్, అదేటైం జగన్ ఎందుకీ ఈ నిర్ణయం తీసుకున్నారు…

అదే ప్లేస్, అదేటైం జగన్ ఎందుకీ ఈ నిర్ణయం తీసుకున్నారు...

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… ఏపీ అధికార పగ్గాలు చేపట్టిన మూడు నెలల తరువాత జగన్ ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు సిద్ధమయ్యారు…

గతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత సెప్టెంబర్ రెండవ తేదీన రచ్చ బండ కార్యక్రమానికి వెళ్లారాని, ఈ కార్యక్రమాన్ని మొదటి సారి చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం అయిన చంద్రగిరిలో మొదలు పెట్టారు…

ఈకార్యక్రమానికి వెళ్తున్న సమయంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే… ఈ కార్యక్రమం ఎక్కడైతే ఆగిందో అక్కడినుంచే జగన్ మోహన్ రెడ్డి స్టార్ట్ చేయనున్నారు… అదే ప్లేస్, అదేటైంలో ప్రజలు మరింత దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో జగన్ సెప్టెంబర్ రెండవ తేదీన కార్యక్రమం మొదలు పెట్టి ప్రజలకు మరింత దగ్గర అవ్వనున్నారు… ముందుగా ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రికి, చిన్నాన్న, వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించి ఆ తరువాత జగన్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు