జగన్ మరో కీలక నిర్ణయం

జగన్ మరో కీలక నిర్ణయం

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు… ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ కు జగన్ సర్కార్…. ప్రభుత్వ సలహాదారుడుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది… పాత్రికే వృత్తిలో ఆయనకున్న అపారమైన అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది…

కాగా దేవులపల్లి అమర్ 1975లో ప్రజాతంత్ర పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఆంధ్రప్రభలో స్టాఫ్ కరస్పాండెంట్ లో కొంతకాలం పనిచేసి అందులో సహాయ సంపాదకునిగా ఎదిగారు.

అలాగే ఈనాడు, ఉదయం, ఆంధ్రభూమి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలలో పనిచేసి మంచి అనుభవాన్ని సంపాదించారు. అమర్ రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) అధ్యక్షుడిగా ఉన్నాడు