వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన నిజాలు

వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన నిజాలు

0

గత సంవత్సరం మార్చి 15న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ కేసులో మరో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.. గ‌తంలో ఈ హ‌త్య‌కేసులో సాక్షాల‌ను తారుమారు చేశార‌నే అభియోగంపై నింధితులు ఎర్ర‌గంగి రెడ్డి, కృష్ణారెడ్డి, ప్ర‌కాశ్ ల‌ను అదుపులో తీసుకున్నారు…

అంతేకాదు అప్ప‌టి ప్ర‌భుత్వం ఈ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించేందుకు సిట్ ను నియ‌మించింది… ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేయడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి..

ప్రొద్దుటూరుకు చెందిన సునిల్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు… ఈ కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్న తరణంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి…. అయితే సునిల్ కు శ్రీనివాస్ రెడ్డికి సంబంధాలు లేవని తేలింది… అలాగే కడప జిల్లుకు చెందిన ఓ పెద్ద వ్యక్తి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు…