ఏపీని మార్చడమే నా కల

ఏపీని మార్చడమే నా కల

0

రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రంగా మార్చాలన్నదే తన కల అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగాంగా డల్లాస్లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంవత్సరానికి ఒకటి రెండు సార్లయినా సొంత గ్రామాలకు వఛ్చి అందరిని పలకరించని, పెట్టువాడులు పెట్టడానికి ముందడుగు వేస్తూ మీరు రావాలని, ప్రభుత్వం అన్నిరకాలుగా తోడుంటుందని సీఎం చెప్పారు. గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాటం ఉన్నవాళ్లు గ్రామాల్లో వైద్యాశాలలు మార్చాలని తపన ఉన్నవాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చ్చారు. అందరు కలిల్సి గ్రామాలను బాగుపరుచుకుందామని, ప్రభుత్వ ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతివ్వాలని కోరారు. కులాలు, మతాలూ, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది తన కల అని తెలిల్పారు. అణగారిన వర్గాలు, బిసి, ఎస్సి, ఎస్టీ మైనారిటీలకు గతంలో ఎప్పుడు లేని విధంగా నామినేటెడ్ పదవులు,నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.