చంద్రబాబును ఢీ కొట్టేందుకు భారీ బడ్జెట్ తో రంగంలోకి కీలక వ్యక్తిని దింపిన జగన్

చంద్రబాబును ఢీ కొట్టేందుకు భారీ బడ్జెట్ తో రంగంలోకి కీలక వ్యక్తిని దింపిన జగన్

0

మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది… ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అడ్డుకుని తీరాలనే ప్రయత్నం చేస్తోంది… మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ తమదైన శైలిలో ప్రవర్తిస్తూ వైసీపీని దెబ్బకొడుతోంది…

హైకోర్టులో కేసులు కూడా వేస్తోంది… ఇప్పటికే హైకోర్టులో మూడు రాజధానులపై భారీగా పిటీషన్లు దాఖలు అయ్యాయి… ఎలాగైనా వైసీపీ సర్కార్ ను ఎదుర్కోవాలనే ఉద్దేశంలో టీడీపీ నాయకులు ఢిల్లీ నుంచి న్యాయవాదులను రప్పించి వైసీపీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అన్ని మార్గాలను అన్వేసిస్తున్నారు…

ఈ నేపథ్యంలో సర్కార్ కూడా అప్రమత్తం అయింది.. టీడీపీకి ధీటుగా ఎదుర్కునేందుకు గాను రాజధాని కేసులకు ముకుల్ రోహిత్గిని ప్రభుత్వం నియమించింది… ముకుల్ రోహిత్గికి 5 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది… అడ్వాన్స్ గా కోటి ఇస్తూ జీవో జారీ చేసింది…