టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపై సీఎం జగన్ స్పందన

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపై సీఎం జగన్ స్పందన

0

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు… కొద్దికాలంగా మూత్రపిండాలతో బాధపడుతూ… ఈ రోజు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు..

శివప్రసాద్ మృతిపట్ల జగన్ విచారం వ్యక్తం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జగన్ ఓ ప్రకటణ కూడా విడుదల చేశారు.. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శివప్రసాద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

కాగా శివ ప్రసాద్ 1951 జులై 11న చిత్తూరు జిల్లాపొట్టిపల్లి గ్రామంలో జన్మించారు.. 1999-2004 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999-2001 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

ఇక 2009, 2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.