కంఫ్యూజన్లో జగన్.. అసలు ఏం జరుగుతోంది…!?

కంఫ్యూజన్లో జగన్.. అసలు ఏం జరుగుతోంది...!?

0

వైసీపీ సర్కార్ వచ్చి గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. కొత్త మోజు ఇంకా అలాగే ఉంది. ఓ వైపు టీడీపీ ఎంత గిల్లుకున్నా ఇది నిజమని నమ్మలేని పరిస్థితి. దూకుడుగా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ విపక్షాలకు షాకివ్వబోయి…

తానే కంఫ్యూజన్లో పడిపోతున్నారా. చెప్పింది చేయడం, మడమ తిప్పకపోవడం అన్నది తన విధానమని చెప్పుకునే జగన్ కి తొలి దెబ్బ రైతుల నుంచే ఎందుకు వస్తోంది. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్ కి ఆ రైతులనే చూపించి విపక్షాలు విమర్శలకు దిగే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు. అసలు జగన్ సర్కార్ రైతుల విషయంలో ఎందుకిలా చేస్తోంది.

ఇప్పటికే విత్తనాలు దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నట్లుగా టీడీపీ దాని అనుకూల మీడియా రెచ్చిపోతున్నాయి. టీడీపీ పాత నేస్తం జనసేన కూడా ఇపుడు రైతుల సమస్యనే ముందుకు తెస్తోంది. ఇది టీడీపీ చేసిన పాపం అనుకున్నా జగన్ సర్కార్ రైతులకు ఇబ్బంది లేకుండా చేయవచ్చు కదా అన్నదే పాయింట్.