ఏపీ ముఖ్యమంత్రి జగన్ జనవరిలో మరో గుడ్ న్యూస్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ జనవరిలో మరో గుడ్ న్యూస్

0

సంక్షేమ పథకాల అమలులో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు, ఇచ్చిన అన్ని హామీలని నెరవేర్చే దిశగా ముందుకు వెళుతున్నారు.. 2020 జనవరి నెలలో పలు పధకాల అమలుకు కార్యాచరణ రూపొందించారు.. అమ్మఒడి కూడా అందించారు. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలకు రుణ మాఫీపై గుడ్ న్యూస్ అందించారు.డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) అధికారులు ముందస్తుగా సంఘాల ఖాతాల్లో ఒక రూపాయి జమ చేస్తున్నారు.

సీఎం జగన్‌ హామీ మేరకు ఎన్నికల తేదీ నాటికి ఏప్రిల్‌ 11కి రాష్ట్రవ్యాప్తంగా 6.25 లక్షల సంఘాలకు రూ.24,603 కోట్లు రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అధికారులు ముందస్తుగా ఒక రూపాయి జమచేసి తనిఖీ చేస్తున్నారు. ఇది కేవలం రూ.5 లక్షల లోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే వర్తించనుంది, దీంతో రూపాయి జమ చేయడంతో డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలను మొత్తం నాలుగు విడుతల్లో మాఫీ చేయనున్నారు. కాకపోతే లోన్ తీసుకున్న డ్వాక్రా సంఘాలు బకాయిలు కడుతూనే ఉండాలి. తర్వాత ఆ డబ్బులను ప్రభుత్వం వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తుంది. జనవరి 25 తర్వాత రుణమాఫి మొదటి విడత జరుగుతుంది నెలాఖరిన మొత్తం అందరికి నగదు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.