తానేంటో మరోసారి నిరూపించుకున్న జగన్

తానేంటో మరోసారి నిరూపించుకున్న జగన్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటి తానేంటో మరోసారి నిరూపించుకున్నారు… జగన్ మోహన్ రెడ్డి ప్రజల మనిషి ప్రజలకు అండగా ఉంటూనే వస్తున్నారు… ఇంతకు జగన్ చేసిన మంచి ఏంటంటే… ఇటీవలే హైదరాబాద్ లో గచ్చిబౌలీలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నుంచి స్పీడ్ గా వస్తున్న ఒక కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ నుంచి కిందపడిన విషయం తెలిసిందే…

ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెంది… అనంతపురానికి చెందిన కుబ్రా అనే యువతి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలు అయింది ఆపరేషన్ చేయాలని అందుకు ఐదు లక్షలు అవుతుందని డాక్టర్లు కుబ్రా తండ్రికి చెప్పారు… రెక్కడితే డొక్కాడని పరిస్థితి వారిది అంత డబ్బు ఎక్కడనుంచి తీసుకురావలో అర్థకాక దీనంగా కూర్చున్నారు…

ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఆసుపత్రికి చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకున్నారు… ఈ విషయాన్ని జగన్ తెలియజేశారు..దీనిపై వెంటనే స్పందించిన జగన్ కుబ్రా ఆపరేషన్ కు ఎంత ఖర్చఅవుతుందో మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేయాలని ఆదేశాలు పంపారు…