జగన్ న్యూ గేమ్ స్టార్… ఇరకాటంలో మోడీ…. చంద్రబాబు డోర్లు క్లోస్… పవన్ నో వాయిస్

జగన్ న్యూ గేమ్ స్టార్... ఇరకాటంలో మోడీ.... చంద్రబాబు డోర్లు క్లోస్... పవన్ నో వాయిస్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు ఇటీవలే ఎస్సీ ఎస్టీ బిల్లు, ఇంగ్లీష్ మీడియం, సీఆర్డీఏ అభివృద్ది వికేంద్రీకరణ బిల్లులు శాసన సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే…

ఆ తర్వాత ఈ బిల్లులను శాసనమండలికి పంపారు అయితే అక్కడ టీడీపీ మెజార్టీ ఎక్కువగా ఉండటంతో మండలి చైర్మన్ షరీఫ్ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో సర్కార్ కు చుక్కెదురు అయింది… దీంతో సీఎం జగన్ శాసన మండలిని రద్దు చేయాలని చూస్తున్నారట…

శాసన మండలిని రద్దు చేయాలంటే శాసనసభ తీర్మాణం తర్వాత దాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలి… పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర పతి ఆమోద ముద్ర వేస్తారు అప్పుడు శాసనమండలి రద్దు అవుతుంది… కాగా శాసనమండలి రద్దు విషయంలో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని అంటున్నారు…