జగన్ షాక్ రూట్ మార్చిన వంశీ

జగన్ షాక్ రూట్ మార్చిన వంశీ

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… ఆయన త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకుంటారని వార్తలు వచ్చాయి…

అయితే తాజాగా వంశీ తన రూట్ ను మార్చినట్లు తెలుస్తోంది… వైసీపీకి కాకుండా బీజేపీకి టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…

తమతో వంశీ టచ్ లో ఉన్నారని అన్నారు… 13 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన వంశీకి బీజేపీ ఆహ్వానం పలుకుతోందని అన్నారు… త్వరలో ఇంకొంత మంది బీజీపీలో చేరుతారని అన్నారు… ఈ లీస్ట్ విడుదల చేయడమే కాకుండా వారిని పార్టీలో చేర్చుకుంటామని విష్ణు అన్నారు…