నోరు జారి టీడీపీకి అడ్డంగా బుక్ అయిన జగన్…

నోరు జారి టీడీపీకి అడ్డంగా బుక్ అయిన జగన్...

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1న ప్రారంభించింది… ఆ ప్రారంబోత్సవ సభను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు…

ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు… అయితే ఈ ప్రసంగ పాఠాన్ని చదువుతూ పలు పదాలను ఆయన తప్పులతడకగా ఉచ్చరించారు దీన్ని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. నిరా రక్షత అంటే నిరక్ష్యరాస్యత, దీవితాన్ని పణంగా అంటే..జీవితాన్ని అనుకుంటా అని అన్నారు.

సంఘ సస్కర్తలు అంటే సంఘ సంస్కర్తలు కాబోలు.. కానీ చివర్లో అన్నారు చూడండి..ఆ ‘రాజిక సౌద్దన్నాన్ని’ అని..అద్గది అది మాత్రం అర్దం కాలేదు. మీకు అర్థం అయితే చెప్తారా విజయసాయిరెడ్డి అని అన్నారు బుద్దా వెంకన్న