జగన్ రాంగ్ స్టెప్… మంత్రులు తీవ్ర అసంతృప్తి

జగన్ రాంగ్ స్టెప్... మంత్రులు తీవ్ర అసంతృప్తి

0

ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి వన్ మ్యాన్ షోలా ప్రవర్తిస్తూ పెత్తనం చలాయిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు, విశ్లేషకులు… గతంలో ఎన్టీఆర్ కు ఇప్పుడు జగన్ రాష్ట్రంలో ఎదురులేకుండా పోయింది… రాష్ట్ర ప్రజలు ఆయనకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వడంతో ఎదురు లేకుండా పోయింది.

అయితే అది ఎళ్లవేళల ఉండదనేది సుస్పష్టమైన మాట… అందుకు తగ్గట్లు జగన్ టీమ్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది… అయితే ప్రస్తుతం జగన్ టీమ్ లో మంత్రులు సమర్థవతంగా లేరని రాజకీయ మేధావులు అంటున్నారు… జగన్ సైన్యంలో ఎక్కువ శాతం ఫ్రెషర్స్ ఉండటంతో 100 రోజుల పరిపాలన ముగిసినా ఆయా శాఖల్లో మంత్రులు పట్టు సాధించలేకపోతున్నారని అంటున్నారు…

పైగా జగన్ కూడా ఆశాఖల్లో సమీక్షలు స్వయంగా నిర్వహిస్తుండటంతో తమకు పెద్దగా ఛాన్స్ దక్కడం లేదని తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాన్ని మంత్రలు బయటపడకుండా చూస్తున్నారట.