వైసీపీ గూటికి మాజీ మహిళా ఎమ్మెల్యే

వైసీపీ గూటికి మాజీ మహిళా ఎమ్మెల్యే

0

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ నుంచి నేతల రాజీనామాలు వేరే పార్టీలోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి ..ముఖ్యంగా 23 మంది మాత్రమే తెలుగుదేశం వెంట ఉంటే వారిలో ఒకరు గన్నవరం నుంచి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు.. అయితే ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ గూటికి చేరే ఆలోచనలో ఉన్నారట.

చిత్తూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభను వైసీపీలో చేర్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్కెచ్ గీశారు అని టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారట. ఆమె ఇంట్లో ఇటీవల జరిగిన శ్రీపురం స్వర్ణ దేవాలయం పీఠాధిపతి పూజల కార్యక్రమానికి పెద్దిరెడ్డి వెళ్లారట. ఈ సమయంలో పార్టీలో ఆమె చేరికపై చర్చించారు అని అంటున్నారు.

అయితే ఆమె ఈ ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు, కాని ఆమె ఓటమిపాలయ్యారు.. దీంతో ఆమె వైసీపీ వైపు వెళ్లాలి అని చూస్తున్నారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ మీటింగుల్లో సమావేశాల్లో పెద్దగా పాల్గొనడం లేదు అనే విమర్శలు అక్కడ వస్తున్నాయి.. కాని టీడీపీ శ్రేణులు మాత్రం ఆమె పార్టీ మారరు అని చెబుతున్నారు.