వైసీపీ సవాల్… చంద్రబాబు సై అంటారా నహీ అంటారా

వైసీపీ సవాల్... చంద్రబాబు సై అంటారా నహీ అంటారా

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమరావతిని తరలించేందుకు రంగం సిద్దం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఈ వార్తలపై స్పందించారు ప్రభుత్వ చిఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జీఎన్ రావు కమిటీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలు సూచించినట్లుగా అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని అన్నారు శ్రీ కాంత్ రెడ్డి…

రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు తన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు… అప్పుడే ప్రజాభిప్రాయం తెలుస్తుందని హెచ్చరించారు… అభివృద్ది వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకు ఎందుకు అంత భయం అని అన్నారు….

మోసం చేసిన చంద్రబాబును రైతులు నిలదీయాలని అన్నారు… తెలంగాణ చేసిన అప్పుకు కాళేశ్వరం భగీరథ కనిపించడంలేదనా ప్రశ్నించారు… అయితే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు ఏమైందో అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు…