‘అయ్యో.. యువరాజ్‌ నువ్వు నాటౌట్‌’

'అయ్యో.. యువరాజ్‌ నువ్వు నాటౌట్‌'

0

భారత ఆల్‌రౌండర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత అతను గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో టొరంటో నేషనల్స్‌ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారి బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ అనూహ్యరీతిలో పెవిలియన్‌కు చేరాడు. గ్లోబల్‌లీగ్‌ రెండోసీజన్‌లో టొరొంటో నేషనల్స్xవాంకోవర్‌ నైట్స్‌ మ్యాచ్‌లో యువరాజ్‌ ఔటవ్వకపోయినా మైదానాన్ని వీడాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. గ్లోబల్‌ లీగ్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువరాజ్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. చీమా వేసిన 17 ఓవర్‌లో యువరాజ్‌ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ, అది బ్యాట్‌కు తగలలేదు. బంతి కీపర్‌ చేతికి తాకి వికెట్లకు తగిలింది. అప్పటికీ అతని కాలు క్రీజ్‌లోనే ఉంది. కానీ యువరాజ్‌ ఔట్‌గా భావించి అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూడకుండానే మైదానాన్ని వీడాడు. యువరాజ్‌ ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 14 పరుగులు చేశాడు. టొరంటో నేషనల్స్‌పై వాంకోవర్‌ నైట్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.