సీఎం మరో 10 రోజుల్లో టీటీడీ పాలకమండలి సభ్యులను నియమిస్తారు: వైవీ సుబ్బారెడ్డి

సీఎం మరో 10 రోజుల్లో టీటీడీ పాలకమండలి సభ్యులను నియమిస్తారు: వైవీ సుబ్బారెడ్డి

0

టీటీడీ ట్రస్టు బోర్డు నూతన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని తనిఖీల నిమిత్తం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఇతర సదుపాయాలపై నిశితంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే టీటీడీ కొత్త పాలకమండలి కొలువుదీరనుందని అన్నారు. సీఎం జగన్ మరో 10 రోజుల్లో పాలకమండలి సభ్యులను నియమిస్తారని వైవీ వెల్లడించారు. ఇక, శ్రీవారి దర్శన విధానాల గురించి మాట్లాడుతూ, త్వరలోనే ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తామని చెప్పారు. వీఐపీలు ఏడాదిలో ఒకసారే తిరుమలను దర్శించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.