జింబాబ్వే టూర్‌..భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ

0

రోహిత్, కోహ్లీ, పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా లేని జట్టును ఊహించడం కష్టం. కానీ వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో వీరు లేకుండానే పోరుకు సిద్ధమై గెలిచింది ధావన్ సేన. వెస్టిండీస్‌తో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది. అలాగే టీ20లోనూ భారత్ సత్తా చాటింది. ఇక ఇప్పుడు జింబాబ్వేతో మరో పోరుకు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు.

జింబాబ్వే‌ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో హరారేలో ఇరు జట్ల మధ్య వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

భారత జట్టు :
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (WK), సంజు శాంసన్ (WK), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ ఖాన్ పటేల్, అవేశ్ ఖాన్ , ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here