తెల్లవారు జామునే నిద్ర లేస్తే శరీరంలో వచ్చే మార్పులు

చాలామంది తెల్లవారు జామునే నిద్రలేవడానికి బద్ధకిస్తూ ఉంటారు.

అలాంటివారితో పోలిస్తే వేకువనే నిద్ర లేచేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారట.

ఈ విషయాన్ని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.

తెల్లవారు జామునే నిద్ర లేవడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

వేకువ జామున నిద్ర లేవడం వల్ల మన శరీరం ఆక్సిజన్ ను ఎక్కువగా గ్రహించే అవకాశం ఉంటుంది.

అంతేకాదు కణాల్లోకి హిమోగ్లోబిన్ సరఫరా కూడా మెరుగ్గా ఉంటుంది.

ఫలితంగా మనలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అందుకే బద్ధకం అనిపించినా తెల్లవారు జామునే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు.