6 రోజుల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారంటే?

అయోధ్య బాలక్ రామ్‌ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

ఈ గణాంకాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

దేశ నలుమూలల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నట్లు తెలిపింది.

ఈ నెల 22 నుండి నిన్నటి వరకు 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్టు ప్రకటించారు.

నిన్న 3.25 లక్షల మంది దర్శనానికి వచ్చినట్టు పేర్కొంది.