రాజశేఖర్ ‘కల్కి’ కాపీనా.. అసలు నిజం ఏంటి..!!

రాజశేఖర్ 'కల్కి' కాపీనా.. అసలు నిజం ఏంటి..!!

0
31

రాజశేఖర్‌ హీరోగా ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో శివాని, శివాత్మిక సమర్పణలో సి. కల్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి’. ఈ నెల 28న విడుదల కానుంది.ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది.

కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రచయిత ఈ కథ తనదేనని చెబుతున్నాడు. ‘మహంకాళి’ సినిమా సమయంలో నేను రాజశేఖర్ కి ‘కల్కి’ టైటిల్ తో కథ చెప్పాను .. స్క్రిప్ట్ కూడా ఇచ్చేశాను. ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ ఎక్కువవుతుంది .. ఇప్పుడు అంత పెట్టలేం’ అని రాజశేఖర్ అన్నారు. దాంతో నేను వేరే ప్రయత్నాల్లో ఉండిపోయాను. ఇప్పుడు అదే కథకి కొన్ని మార్పులు చేసి తీశారు. ఈ విషయంపై రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. అసోసియేషన్ కమిటీ సభ్యులు ‘కల్కి’ యూనిట్ ను చర్చలకు పిలిస్తే రావడం లేదు. ‘కల్కి’ యూనిట్ నుంచి నేను డబ్బులు ఆశించడం లేదు .. క్రెడిట్ ఇస్తే చాలు” అని చెప్పుకొచ్చారు.