ఆసక్తికరంగా “రాజా వారు రాణి గారు” టీజర్

ఆసక్తికరంగా "రాజా వారు రాణి గారు" టీజర్

0

రవికిరణ్ కోల దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమవుతున్న సినిమా “రాజా వారు రాణి గారు”. తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. అందరూ కొత్త వాళ్లు కలిసి చేస్తోన్న ఈ సినిమా టీజర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. బుర్రకథ చెబుతూ సినిమాలో పాత్రల్ని పరిచయం చేస్తూ ఫన్నీగా టీజర్ కట్ చేశారు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో విజువల్స్ ఉండడం మరో ఆకర్షణగా నిలిచింది. ‘కథలోని మరిన్ని పాత్రలు, మలుపులు, మెలికలు రంగరించి సింగారించి ఒక సుదినమున ట్రైలర్ రూపాన మీ ముందుకు తీసుకొస్తామని మనవి చేసుకుంటున్నాం’ అంటూ టీజర్ చివర్లో చెప్పిన డైలాగ్ బాగుంది.

ఆ సినిమా కంటెంట్ చూస్తుంటే కూడా మంచి హిట్ అందుకునేలా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ తో వచ్చిన చిన్న సినిమాలు స్టార్ కాస్ట్ లేకపోయినా సక్సెస్ అందుకున్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘బ్రోచేవారెవరురా’ ఇదే కోవలోకి వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here