బాలయ్య బాబుకి విలన్ గా బాలీవుడ్ హీరో

బాలయ్య బాబుకి విలన్ గా బాలీవుడ్ హీరో

0

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే లెజెండ్ సింహ వంటి చిత్రాలు సూపర్ హిట్ కాంబోగా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు..బాలయ్య రూలర్ షూటింగ్ పూర్తి అవగానే బోయపాటి సినిమా పట్టాలెక్కనుంది. ఇందుకు కేవలం మరో రెండు నెలలు సమయం పట్టనుందట.

ఇక ఈ సినిమాకోసం ప్రి ప్రోడక్షన్ పనులు సాగుతున్నాయి. అయితే బోయపాటి ఇప్పుడు మరో పనిలో బిజీగా ఉన్నారట. ఈ లోపు బాలయ్య సినిమాలో ఆయనకు విలన్ గా ఎవరు అనేది చూస్తున్నారు, అయితే బోయపాటి సినిమాల్లో కూడా ప్రతినాయకుడి పాత్రకు బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది ..అందుకే బాలీవుడ్ వరకూ విలన్ కోసం వెతుకుతున్నాడు బోయపాటి అని తెలుస్తోంది.

బాలీవుడ్ దాదా సంజయ్ దత్ బాలయ్య బాబుకి ప్రతినాయకుడిగా ఎలా ఉంటారు అని ఆలోచించారట, అంతేకాదు బీటౌన్ కు వెళ్లి ఆయనతో స్టోరీ డిస్కస్ చేశారు అని తెలుస్తోంది, ఇక సంజు బాయ్ విలన్ రోల్ చేస్తే ఇక బాలయ్య సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు అంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here