మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ

0

నందమూరి వంశంలో హీరోలు నటనలో నట సింహాలే అని చెప్పాలి. అందుకే తెలుగు ప్రేక్షకులు అందరూ నందమూరి హీరోలని అభిమానిస్తారు. బాలయ్య ఎన్టీఆర్ సినిమాలు అంటే పడి చస్తారు, అయితే మరో వారసుడు నందమూరి కుటుంబం నుంచి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు, ఇంతకీ ఎవరనేగా మీ మీమాంశ,

నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఇప్పటికే హీరోలుక్స్ తో ఉన్న మోక్ష ఎప్పుడు సినిమా అరంగేట్రం చేస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య తన కుమారుడితో తొలి సినిమా నిర్మించాలని భావించాడని కొన్ని వార్తలు వినిపించాయి.
బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కిస్తోన్న మూవీ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అన్నారు. కాని దీనిపై బోయపాటి బాలయ్య బాబు ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. ఇది గాసిప్ అని తేలిపోయింది.

తాజాగా ఈ వార్తలపై బాలయ్య స్పందించారట.మోక్షజ్ఞ ఎంట్రీపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని.. అతడి ఎంట్రీ ఇప్పుడే ఉండదని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా ఆయన కుమారుడు చదువుపై ఫోకస్ పెట్టారట. అది పూర్తి అయిన తర్వాత సినిమాలు చేయిస్తామని అప్పుడే నటనలోకి తీసుకురాము అన్నారట. అంతేకాదు బాలయ్యకచ్చితంగా తన కుమారుడు సినిమాలు చేస్తాడు అని చెప్పారట. బాలయ్య తన కుమారుడి కోసం యువ దర్శకుల దగ్గర కథలు కూడా వింటున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here