ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రవితేజ

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రవితేజ

0

మాస్ మహరాజ్ రవితేజ సినిమాల జోరు పెంచారు, తాజాగా వీఐ ఆనంద్ దర్శకత్వం లో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి అవడంతో సినిమా టెక్నికల్ వర్క్ లు ఫినిష్ అవుతున్నాయి.
ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే దీపావళి పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు రాజా ఫేవరెట్ బాణీల మాస్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అయితే ముందుగానే ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కాని ఈ చిత్రం జనవరి 24 కు బరిలోకి వస్తోంది, ఇక సినిమాకి సంబంధించి ట్రైలర్ ని డిసెంబర్ మూడోెవ వారంలో విడుదల చేస్తారట. ఇక తాజాగా వదిలిన పోస్టర్ లో మాస్ మహరాజ్ లుక్ అదిరింది. ఇక మాస్ ప్రేక్షకులకు ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి, అయితే ముందు సినిమా డిసెంబర్ 20 న రిలీజ్ చేద్దాము అనుకున్నారు కాని సినిమా వర్కులు ఫినిష్ కాకపోవడంతో సినిమాని సడెన్ గా జనవరికి పోస్ట్ పోన్ చేశారట..మాస్ మహారాజా సరసన పాయల్ రాజ్ పుత్- నభా నటేష్- తాన్యా హోప్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. వరల్డ్ వైపు ఇక మాస్ మహారాజ్ అభిమానులకు జనవరి 24 పండుగే అని చెప్పాలి.