జగన్ పై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్ పై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

0

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన అక్కడ పార్టీనేతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లడుతూ….

ప్రస్తుతం అధికార నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని నాగబాబు మండిపడ్డారు… తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆయన వైసీపీకి హెచ్చరించారు… అధికారం ఒక డబ్బా సొత్తుకాదని ఎవరు ప్రజల మనసును గెలుచుకుంటారో వాళ్ళకి అధికారం దక్కుతుందని అన్నారు…

అధికారం ఐదు సంవత్సరాలే అని అన్నారు… ప్రజా మద్దతు కోల్పోతే ఎవరైనా అధికారం కోల్పోవాల్సిందేనని అన్నారు… అధికారం ఉందికదా అని పోలీసుల్ని విచ్చల విడిగా వాడుకుని కేసులు పెట్టి తమ కార్యకర్తలను హింసిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here