తెలంగాణలో రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం అరుదైన గౌరవం

తెలంగాణలో రోహిత్ శర్మ పేరుతో క్రికెట్ స్టేడియం అరుదైన గౌరవం

0
37

రోహిత్ శర్మ భారత క్రికెట్లో ఓ గొప్ప బ్యాట్సమెన్ అనే చెప్పాలి తనదైన ఆటతో క్రికెట్ ప్రేక్షకులను అలరిస్తుంటాడు, అయితే రోహిత్ గ్రీస్ లో ఉంటే, ఇక మ్యాచ్ మనదే అనే ఆశలు కూడా ఉంటాయి. కెప్టెన్ కోహ్లీతో పోటాపోటీగా రికార్డులు వేటాడుతున్న ఈ ముంబయి ఆటగాడి పేరుమీద తెలంగాణలో ఓ క్రికెట్ స్టేడియం, అక్కడే ఓ అకాడమీ నిర్మితమవుతున్నాయి. అయితే చాలా మందికి ఈ విషయం తెలియదు కాని ఇది వాస్తవం.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేయగా, రోహిత్ శర్మ సతీసమేతంగా విచ్చేశాడు.శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరుపుకుంటోంది.. కన్హ గ్రామ శివార్లలోని స్టేడియం నిర్మిస్తున్నారు.

యువత స్ఫూర్తినిచ్చే వ్యక్తుల్లో రోహిత్ శర్మ ఒకడని, అందుకే అతని పేరును క్రికెట్ స్టేడియంకు పెట్టామని వివరించారు అక్కడ రామచంద్రా మిషన్ వారు. అయితే ఇలా చేయడం పట్ల రోహిత్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.. ఇతర టీమిండియా క్రికెటర్లని కూడా తీసుకువస్తా అని తెలిపారు.