సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ప్రిన్స్ మహేష్ బాబు చిత్రం

0

ఈ సంక్రాంతికి మహేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు… సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ తో భారీ వసూళ్లతో రికార్డులతో దూసుకుపోతోంది..అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు, రష్మిక జంటగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు మొన్న విడుదలై, తొలిరోజే కలెక్షన్లలో దుమ్ము దులిపింది.

ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రావడంతో తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం సినిమాపై ఓవరాల్ గా పాజిటీవ్ టాక్ వచ్చింది అయితే సంక్రాంతి బరిలో నిలిచిన తొలి సినిమాగా విడుదలై రికార్డు క్రియేట్ చేసింది.

యూఎస్ విషయానికి వస్తే, ప్రీమియర్స్‌ ద్వారా శుక్రవారం అమెరికాలో 7,63,269 డాలర్లను (సుమారు రూ. 5.41 కోట్లు)ను రాబట్టింది. ఆపై శనివారం ఉదయానికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరి, ‘మహర్షి’ రికార్డును అధిగమించింది. దీంతో అమెరికాలో ఇదే ప్రిన్స్ కు రికార్డు అంటున్నారు ఫ్యాన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here