నిర్భయ దోషుల ఉరి విషయంలో జనవరి 16 న కీలక పని

నిర్భయ దోషుల ఉరి విషయంలో జనవరి 16 న కీలక పని

0
23

నిర్భయ దోషుల ఉరికి టైం దగ్గరకి వచ్చేసింది, దీనిపై తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు, లా ప్రకారం అన్నింటిని పూర్తి చేశారు, వారిని కూడా ఒంటరిగా ఉంచుతున్నారు, ఎలాంటి పని వారి చేత చేయించడం లేదు.
వారి ఉరితీతలో భాగంగా ఈ నెల 16 ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి తీయనున్నారు. ఈ మేరకు జైలు అధికారులు ఈ విషయం తెలిపారు.

బక్సర్ జైలు నుంచి కొనుగోలు చేసిన కొత్త ఉరి తాళ్లతో 16న ఉదయం డమ్మీ ఉరి తీయనున్నట్టు పేర్కొన్నారు.
దోషులు పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్టు తెలిపారు. అయితే ప్రతీసారి ఎవరిని ఉరి తీసినా ఇది కామన్ గా చేసే పని.. తాజాగా దీనిని వారం ముందు చేస్తున్నారు జైలు అధికారులు.

ఇసుక బస్తాలకు ఉరి తాళ్లు బిగించి డమ్మీ ఉరి తీయాలని నిర్ణయించినట్టు వివరించారు. అయితే ఉరి తీసే సమయం వరకూ నలుగురిని కలిసి ఉంచము అని చెబుతున్నారు.