నిర్భయ దోషులకు ఈ కారణంతోనే ఉరిశిక్ష అమలు ఆలస్యం

నిర్భయ దోషులకు ఈ కారణంతోనే ఉరిశిక్ష అమలు ఆలస్యం

0
53

నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి… ఈ నెల 22న నిర్భయదోషులకు ఉరిశిక్ష వేయడం సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది… నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు దరఖాస్తు చేశారు..

మరో వైపు రాష్ట్రపతి నిర్ణయం వరకు డెత్ వారెంట్ స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశాడు ముఖేష్ అయితే జైలు నింబంధనల ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం వెలువడేవరకు ఉరిశిక్ష అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది…

కాగా ఈనెల 22న నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయమని తీర్పునిచ్చింది… ముఖేష్ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినా నింబంధనల ప్రకారం ఉరి తీయడానికి ముందు కనీసం 14 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు…